close

భారత్‌-ఎ జట్టుదే సిరీస్‌
మౌంట్‌ మౌంగనుయ్‌ (న్యూజిలాండ్‌): న్యూజిలాండ్‌-ఎతో అనధికార వన్డే సిరీస్‌ను భారత్‌-ఎ మరో వన్డే మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 9 వికెట్లకు 299 పరుగులు చేసింది. విల్‌ యంగ్‌ (102; 106 బంతుల్లో 6×4, 3×6) సెంచరీ చేయగా.. జార్జ్‌ వర్కర్‌ (99; 106 బంతుల్లో 8×4, 1×6) కూడా రాణించాడు. మనీష్‌ పాండే (111 నాటౌట్‌; 109 బంతుల్లో 5×4, 3×6) అజేయ శతకం చేయడంతో భారత్‌ 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (59), విజయ్‌ శంకర్‌ (59) రాణించారు.

ప్రధానాంశాలు

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.