close

వాడేకర్‌కు మేం కృతజ్ఞులం: సచిన్‌
దిల్లీ: మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ మృతిపై పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌పై ఆయన చాలా ప్రభావం చూపారని సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. ‘‘అజిత్‌ వాడేకర్‌ సర్‌ మరణ వార్త నన్ను కలిచివేసింది. 90లలో మేము అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. మేం అందుకు కృతజ్ఞులం’’ సచిన్‌ అన్నాడు. ‘‘ఆయనో గొప్ప వ్యక్తి. ఆయన మరణం నన్నెంతో బాధించింది. వాడేకర్‌ సర్‌ నాకు తండ్రి లాంటివాడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా’’ అని మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ చెప్పాడు.‘‘వాడేకర్‌ మృతి వేదన కలిగిస్తోంది. ఆయన తండ్రిలాంటి వాడు. మంచి వ్యూహకర్త’’ అనికుంబ్లే అన్నాడు.
అతడు ఎప్పుడూ నాయకుడే
‘‘రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున నేను అరంగేట్రం చేసినప్పుడు వాడేకర్‌ నా కెప్టెన్‌. భారత జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పుడు కూడా ఆయనే నా కెప్టెన్‌. 1971లో వాడేకర్‌ సారథ్యంలోనే భారత్‌.. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌లలో తొలిసారి టెస్టు సిరీస్‌ విజయాలు సాధించింది.అయినా సారథిగా వాడేకర్‌కు రావాల్సినంత పేరు రాలేదు. ‘అరె క్యా రే’ అంటూ నేను ఆతణ్ని అనుకరించని రోజు ఒక్కటీ ఉండేది కాదు. నా కెప్టెన్‌ ఇక లేడు. కానీ నేను ‘అరె క్యా రే’ అన్న ప్రతిసారి అతడు నాతోనే ఉంటాడు’’ 
- సునీల్‌ గావస్కర్‌

ప్రధానాంశాలు

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.