close

ప్రధానాంశాలు

డు..డు..డు..అంబటి రాయుడు

పుణె: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. మైదానంలో, డ్రస్సింగ్‌ రూమ్‌లో చెన్నై ఆటగాళ్లు ఎంతో సరదాగా గడపడం తెలిసిందే. ముఖ్యంగా ఆ జట్టులో బ్రావో సహచర ఆటగాళ్లను ఆట పట్టిస్తూ, డ్యాన్స్‌లు వేయించిన వీడియోలు మనం అనేకం చూశాం. తాజాగా హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు గురించి ఆ జట్టు ఆటగాడు మార్క్‌వుడ్‌ ఓ పాట సిద్ధం చేశాడు. ఆ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

కొన్ని కారణాల వల్ల మార్క్‌వుడ్‌ మధ్యలోనే ఐపీఎల్‌ను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో వుడ్‌ చెన్నై తరఫున కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అది కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే. తాజాగా మార్క్‌వుడ్‌ డ్రస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల మధ్య రాయుడుపై రాసిన పాటను పాడుతూ కనిపించాడు. వుడ్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా తమ గొంతుతో పాటు కాలును కదిపారు. ‘డు..డు..డు.. అంబటి రాయుడు’ అంటూ సాగే ఈ పాటను మార్క్‌వుడ్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వుడ్‌ పోస్ట్‌ చేసిన ఈ పాట అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో విశేషంగా రాణిస్తోన్న ఆటగాళ్లలో రాయుడు ఒకడు. 12 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన చూసిన బీసీసీఐ సెలక్టర్లు రాయుడుకి తిరిగి భారత జట్టులో ఆడే అవకాశాన్ని సైతం కల్పించారు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి!


మరిన్ని

© 1995 - 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu Internet Division.
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers