సామాజిక మాధ్యమాలతో బాలికల ఆరోగ్యం హరీ!
లండన్‌: సామాజిక మాధ్యమాల ప్రభావం బాలబాలికలపై భిన్నంగా ఉండే అవకాశముందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. బాలురతో పోలిస్తే బాలికల ఆరోగ్యాన్ని ఈ వేదికలు ఎక్కువగా దెబ్బతీస్తున్నాయని గుర్తించింది. ఎసెక్స్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌(యూసీఎల్‌) పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దాదాపు పదేళ్ల వయసులో సామాజిక మాధ్యమాలను ఎక్కువగా(ప్రతిరోజు గంట కంటే అధిక సమయం) ఉపయోగించిన బాలికలు 10-15 ఏళ్ల మధ్య ఎక్కువగా అనారోగ్యం బారినపడుతున్నారని వారు గుర్తించారు. బాలురలో ఈ దుష్ప్రభావం అంతగా కనిపించడం లేదని స్పష్టం చేశారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.