భాజపా అబ్రకదబ్ర
న్నికల ప్రచారంలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగించడంలో పెట్టింది పేరైన భాజపా.. ఈ సారి మధ్యప్రదేశ్‌లో ఓ సంప్రదాయ విధానం వైపు మొగ్గుచూపుతోంది. ప్రచారంలో ఇంద్రజాలికుల్ని వినియోగించి ఓటర్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది.
పదుల సంఖ్యలో ఇంద్రజాలికులతో పాటు ఇతర గారడీ విద్యలు ప్రదర్శించేవారు, వీధి నాటకాలు వేసేవారు, ఆధ్యాత్మిక గీతాల గాయకులను ప్రచారంలో వినియోగించాలని కమల దళం ఓ నిర్ణయానికి వచ్చింది. తాజాగా పార్టీ ప్రధాన కార్యాలయానికి ఇద్దరు ఇంద్రజాలికులను పిలిపించి.. వారు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకోగలరో పరీక్షించారు. గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి కళాకారులను ఆహ్వానించి.. వారికి తొలుత రాష్ట్ర పరిస్థితులపై అవగాహన కల్పించి రంగంలోకి దింపనున్నారు. గ్రామీణ ప్రజలకు తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు చక్కగా వివరించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని భాజపా నేతలు చెబుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నారంటూ ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌ సారథి కమల్‌నాథ్‌ విమర్శలు చేయడం యాదృచ్చికం. అయితే, మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాను ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధమేనని చౌహాన్‌ ఆ విమర్శలను తిప్పికొట్టారు.

కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.