కరీంనగర్‌లో ఐఐఐటీకి కేంద్రం సానుకూలం
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి
ఈనాడు, దిల్లీ: కరీంనగర్‌లో ఐఐఐటీ (ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సానుకూలత వ్యక్తం చేశారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శనివారం సాయంత్రం దిల్లీలో కేంద్ర మంత్రిని కేటీఆర్‌, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ కలిశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌ తర్వాత కీలకమైన కరీంనగర్‌లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జావడేకర్‌లకు లేఖ రాశారని తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటు చేయాలని గత మూడేళ్లుగా ఎంపీ వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. తాజాగా కేంద్రం ప్రభుత్వం నూతన ఐఐఐటీల ఏర్పాటుకు ప్రయత్నిస్తుండడం.. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఇప్పటికే భూ కేటాయింపు పూర్తయిన కరీంనగర్‌కు ఐఐఐటీ కేటాయించాలని మరోమారు విజ్ఞప్తి చేశామన్నారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.