Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

టాలీవుడ్‌

ప్రభాస్‌ అంటే ఇష్టం
‘ఆటగాళ్లు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది దర్శనా బానిక్‌. జగపతిబాబు, నారా రోహిత్‌ నటించిన ‘ఆటగాళ్లు’ చిత్రంలో నటించింది. పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. ఇది 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడింది.
* ఇందులో నా పాత్ర పేరు అంజలి. అందం, అభినయం రెండూ కలబోసిన పాత్ర ఇది. నాకూ కొన్ని పదునైన సంభాషణల్ని ఇచ్చారు. ఒకటికి పదిసార్లు సంభాషణలు చెప్పడంలో కసరత్తు చేసి మరీ సెట్‌కి వచ్చాను. పతాకదృశ్యాల్లో బాగా పేరొస్తుందని ఆశ. ముంబయిలో విష్ణుదేవా అనే కొరియోగ్రాఫర్‌తో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేశాను. ఆయన ద్వారానే నాకు ఈ అవకాశం వచ్చింది. తెలుగులో అవకాశాలు వస్తున్నాయి’’.
* ‘‘మాది కోల్‌కతా. డిగ్రీ వరకు అక్కడే చదివా. వాణిజ్య సంస్థలకి మోడల్‌గా చేయడం వల్ల సినిమా అవకాశాలు వచ్చాయి. ఆరు బెంగాలీ చిత్రాలు చేశా. అవన్నీ మంచి విజయాల్ని అందుకున్నాయి. తెలుగులోనూ అలాంటి కథలనే ఎంచుకుంటా. ప్రస్తుతం తెలుగు భాష నేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నా. షారుక్‌ఖాన్‌ నా అభిమాన కథానాయకుడు. తెలుగులో ప్రభాస్‌ అంటే ఇష్టం. ‘బాహుబలి’ చూసిన తరవాత ప్రభాస్‌కీ, రాజమౌళికీ అభిమానినయ్యా. అల్లు అర్జున్‌ కూడా ఇష్టమే’’.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.