Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

టాలీవుడ్‌

జార్జియాలో ‘సైరా’యుద్ధం
బ్రిటిష్‌ పాలనకి వ్యతిరేకంగా తొలిసారి తిరుగుబాటు బావుటా ఎగరేసిన భారతీయ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు. నయనతార కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జార్జియాలో యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వందల మంది జూనియర్‌ ఆర్టిస్టులు, భారీ సెట్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పోరాట ఘట్టం కోసం రూ.40 కోట్లకిపైగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే చిరంజీవి చిత్రీకరణలో పాల్గొంటారు. ఇదివరకు హైదరాబాద్‌లో 35 రోజులపాటు రాత్రిళ్లలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. దాదాపుగా రూ.200 కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో తమన్నా, సుదీప్‌, జగపతిబాబు, తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, సంగీతం: అమిత్‌ త్రివేది.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.