Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

అత్యంత దీనస్థితిలో సల్మాన్ హీరోయిన్‌

కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బులేదట

ముంబయి: అలనాటి బాలీవుడ్‌ నటి పూజా దడ్వాల్‌ తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్నారు. కొంతకాలంగా ఆమె క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని స్థితిలో ఉన్నారు. 1990ల్లో వచ్చిన ‘వీర్‌ ఘటి’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా పూజ నటించారు. తన అనారోగ్యం గురించి పూజ పలు మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. సాయం కోసం సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించాను. కానీ, కుదరలేదని తెలిపారు. ‘నాకు క్షయ ఉందని ఆరు నెలల క్రితం తెలిసింది. సాయం కోసం సల్మాన్‌ను కలవడానికి యత్నించాను. కానీ, వీలుపడలేదు. కనీసం ఈ రకంగానైనా సల్మాన్‌ నా గురించి తెలుసుకుని సాయం చేస్తారని ఆశిస్తున్నాను. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నాను. కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాను. ఉన్న డబ్బంతా దానికే అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. టీ కొనుక్కోవడానికి కూడా వేరే వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనారోగ్యం గురించి తెలిసి భర్త, బంధువులు వదిలి వెళ్లిపోయారు.’ అని చెప్తూ బాధపడ్డారు పూజ. ఆమె ‘హిందుస్థాన్‌’, ‘సింధూర్‌ సౌగంధ్‌’ చిత్రాల్లోనూ నటించారు.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.