latest breaking telugu news
close

తాజావార్తలు

మహిళననుకుని అసభ్యంగా ప్రవర్తించారు
ప్రముఖ కమెడియన్‌ అలీ అస్గర్

ముంబయి: చిత్ర పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం తుపాను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎందరో ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్‌ వరకు ఎందరో నటీమణులు తమ పట్ల జరిగిన లైంగిక వేధింపులను బయటపెట్టారు. ఇప్పుడు మరో ‘మీటూ’ సంఘటన బయటికి వచ్చింది. అయితే ఈసారి బయటపెట్టింది అమ్మాయి కాదు.. బాలీవుడ్‌ హాస్యనటుడు అలీ అస్గర్‌. హిందీలో బాగా పాపులర్‌ అయిన ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్’లో అలీ ‘దాది’ పాత్రలో నటించేవారు.

ఈ ఒక్క పాత్రలో అలీ దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అభిమానులు అలీతో ‘దాది’ పాత్రను వేయించి కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఓసారి అలీకి ఓ ప్రైవేట్‌ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ షోలోనూ అతను ‘దాది’ గెటప్‌ వేసుకుని వెళ్లారు. అయితే అలీని చూసి అందరూ నిజంగానే మహిళ అనుకుని అసభ్యంగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని అలీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘నేను షోలో అడుగుపెట్టేముందు యాంకర్‌కు నా పేరు చెప్పే అవకాశం ఇవ్వను. నేనే ఎంటర్‌ అయిపోయి అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తుంటాను. అయితే షోలో నా ప్రదర్శన మొదలవడానికి ముందే అక్కడి ప్రేక్షకులు బాగా తాగి ఉన్నారు. అయినప్పటికీ నేను ప్రదర్శిస్తూనే ఉన్నాను. ఆ సమయంలో కొందరు వ్యక్తులు నన్ను మహిళ అనుకుని నా నడుము పట్టుకోవడం లాంటి అసభ్యకర పనులు చేశారు. ‘నేను బామ్మ గెటప్‌లో ఉన్న మగాడిని అన్న విషయం మీకు తెలుసా?’ అని వారికి చెబుతూనే ఉన్నాను. అయినా వారు వినే పరిస్థితిలో లేరు. ‘కనీసం పెద్దదాన్ని అన్న గౌరవంతోనైనా వదిలేయండి’ అని వేడుకున్నాను. అప్పుడు షోలో పాల్గొన్న ఓ అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది.’ అని వెల్లడించారు అలీ అస్గర్‌.


జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని

రాజకీయం

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

జనరల్‌

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.