‘సిద్ధూ భార్య అక్కడే ఉన్నా పట్టించుకోలేదు’
close

తాజావార్తలు

‘సిద్ధూ భార్య అక్కడే ఉన్నా పట్టించుకోలేదు’
పలువురి ఆందోళన

అమృత్‌సర్‌ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ట్రాక్‌పై నిల్చున్నవారిపై రైలు దూసుకెళ్లడంతో 50 మందికిపైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాద సమయంలో నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ సతీమణి నవజ్యోత్‌ కౌర్‌ అక్కడే ఉన్నా.. ఘటనను పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఈ వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్వహించారు. సిద్ధూ సతీమణి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే ట్రాక్‌పై నిల్చున్న వారిపై ట్రైన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనను పట్టించుకోకుండా ఆమె ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు’ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు.


జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని

రాజకీయం

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

జనరల్‌

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.