కశ్మీర్‌కు ‘వీరప్పన్‌ వేటగాడు’
close

తాజావార్తలు

కశ్మీర్‌కు ‘వీరప్పన్‌ వేటగాడు’

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం అన్నివిధాలా రంగం సిద్ధం చేస్తోంది. ఏ దశలోనూ సంఘ విద్రోహశక్తులకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే అత్యున్నత దళాలను తరలించిన ప్రభుత్వం తాజాగా వాటిని సమన్వయ పరిచేందుకు ఓ అత్యున్నత అనుభవజ్ఞుడిని ఎంపిక చేసి గవర్నర్‌ సలహాదారుగా పంపింది. అతనెవరో కాదు.. మాజీ ఐపీఎస్‌ అధికారి కె. విజయ్‌కుమార్‌. ఆయన విధులు, బాధ్యతలు ప్రత్యేకంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

తమిళనాడు, కర్ణాటక పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను మట్టుబెట్టిన అనుభవం ఆయనకుంది. అప్పట్లో మిషన్‌ ఇంపాజిబుల్‌ అయిన వీరప్పన్‌ వేట కోసం విజయ్‌ నేతృత్వంలో నిర్వహించిన ‘ఆపరేషన్‌ కుకూన్‌’ పెద్ద సంచలనం. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని కోసం ఎంతటి సాహసమైనా చేసేందుకు విజయ్‌ వెనుకాడరు. వీరప్పన్‌ వేట సమయంలో అడవుల్లో తాగునీరు లభించకపోతే మురికినీటినే తాగి వేటను కొనసాగించారు. వీరప్పన్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత భగవంతుడికి తలనీలాలను సమర్పించారంటే ఎంత కసిగా ఆపరేషన్‌ నిర్వహించాడో అర్థం చేసుకోవచ్చు.

కశ్మీర్‌లో పనిచేసిన అనుభవం..
1975 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు గతంలో కశ్మీర్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 1998-2001 మధ్యలో ఇక్కడ బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు.

* సీఆర్‌పీఎఫ్‌కు డీజీగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో సీఆర్‌పీఎఫ్‌ కూడా కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రాబల్యం పెరిగిన సమయంలో విజయ్‌ బాధ్యతలను చేపట్టారు. దళాలు వేగంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అక్కడ రహదారులను నిర్మించింది. ఇది విజయ్‌ కృషి ఫలితమే. దీంతో మావోల వేట కూడా వేగవంతమైంది.

* ప్రధాన మంత్రి భద్రతను చూసుకొనే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో కూడా పనిచేశారు. రాజీవ్‌ హత్యకు ఏడాది ముందు ఆయన వేరే చోటకు బదిలీ అయ్యారు.

* విజయ్‌ కుమార్‌ స్వతహాగా షార్ప్‌షూటర్‌.

* 2001-2003 మధ్యలో చెన్నై పోలీస్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఈ సమయంలో నగరంలోని అసాంఘిక శక్తులను నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్‌ చేశారనే పేరుంది.

* హోంశాఖలో సీనియర్‌ సెక్యూరీటీ సలహాదారుగా కూడా పనిచేశారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.