ఆ కోతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి
close

తాజావార్తలు

ఆ కోతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి

మేరఠ్‌: కొన్ని కోతులు చెట్టుపైకి ఎక్కి ఓ వృద్ధుడిపైకి ఇటుక రాళ్లు విసరడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ భాగ్‌పత్‌లోని తిక్రీ గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ఆ కోతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. అయితే, అందుకు పోలీసులు అంగీకరించలేదు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ధర్మాసింగ్‌ (72) అనే వ్యక్తి చెట్టు కిందకు వెళ్లి కట్టెపుల్లలు సేకరిస్తున్నాడు. ఆ చెట్టు పక్కనే ఓ పాత ఇల్లు ఉంది. అయితే, అదే సమయంలో ఆ ఇంటి వద్ద నుంచి ఇటుకలను చేతిలో పట్టుకుని చెట్టు ఎక్కిన కోతులు ఆ వృద్ధుడిపై వాటిని విసిరేశాయి. దీంతో గాయపడిన ధర్మాసింగ్‌ను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి దాడి చేసిన కోతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేయాలని కోరారు. ధర్మాసింగ్‌పై ఇటుకలు విసరడంతో ఆయన తల, ఛాతిపై తీవ్రగాయాలయ్యాయని వారు చెప్పారు. అయితే, దీన్ని ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఆయన కుటుంబ సభ్యుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ... ‘ఆ కోతులు సుమారు 20 ఇటుకలను ఆయనపైకి విసిరేశాయి. తల, ఛాతి, కాళ్లపై ఆయనకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ ఘటన కోతుల వల్లే జరిగింది. వాటినే నిందితులుగా పరిగణించాలి. మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. కానీ, వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయట్లేదు’ అని చెప్పాడు. కాగా, ఆ ప్రాంతంలో కోతుల బెడద అధికంగా ఉందని, ఇటువంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.