బర్త్‌డే నాడు మెస్సికి ఊహించని కానుక
close

తాజావార్తలు

బర్త్‌డే నాడు మెస్సికి ఊహించని కానుక

మాస్కో: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సికి పుట్టిన రోజు ఊహించని కానుక అందింది. తన ఆటతీరుతో యావత్తు ప్రపంచంలో మెస్సి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. రష్యా వేదికగా ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రష్యాలోని బ్రానిట్సీ పట్టణవాసులు మెస్సికి అభిమానులు. గత ఆదివారం(జూన్‌ 24) నాడు మెస్సి తన 31వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా బ్రానిట్సీ వాసులు మెస్సికి ఫిపా ప్రపంచకప్‌ నమూనాను తయారు చేసి పుట్టిన రోజు కానుకగా ఇచ్చారు. అంతేకాదు ప్రత్యేకంగా తయారు చేసిన కేకును పంపించారు. స్థానిక అభిమానుల నుంచి అందుకున్న ఈ కానుకలు చూసి మెస్సి ఆనందం వ్యక్తం చేశాడు. వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

టోర్నీలో భాగంగా గురువారం రాత్రి క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 0-3తో ఓటమి చవిచూసింది. దీంతో తుది-16లో స్థానంపై అనుమానం నెలకొంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా కేవలం ఒక్క పాయింట్‌తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.