త్వరలో హెచ్‌1-బీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
close

తాజావార్తలు

త్వరలో హెచ్‌1-బీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు స్వీకరిస్తామని అమెరికా పౌర వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. అలాగే హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఈ వీసాల ద్వారా అమెరికా వెళ్తుంటారు. హెచ్‌1-బీ వీసాలతో అమెరికాలోని కంపెనీలు భారత్‌, చైనా లాంటి దేశాల నుంచి టెక్నాలజీ నిపుణులను వేల సంఖ్యలో నియమించుకుంటున్నాయి.

హెచ్‌1-బీ తాజా దరఖాస్తులు 2019 ఆర్థిక సంవత్సరం కోసం తీసుకుంటున్నారు.  2019 సంవత్సరానికి ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు చేస్తున్నామని, అయితే ఈ ఏడాదికి సంబంధించి 2018 సెప్టెంబరు 10 వరకు ప్రీమియం ప్రాసెసింగ్‌ను కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ ప్రీమియం ప్రాసెసింగ్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా ప్రజలకు సమాచారం ఇస్తామని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టంచేసింది. హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల పరిశీలన సమయం తగ్గించేందుకే తాత్కాలికంగా ప్రీమియం ప్రాసెసింగ్‌ను నిలిపేస్తున్నామని వెల్లడించింది.  గత కొన్నేళ్లుగా ప్రీమియం ప్రాసెసింగ్‌ దరఖాస్తులు ఎక్కువగా వస్తుండడంతో సాధారణ దరఖాస్తులు

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, వాటి పరిశీలన సమయం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏటా 65వేల హెచ్‌1-బీ వీసాలు జారీ చేస్తారు. యూఎస్‌సీఐఎస్‌ వివరాల ప్రకారం 2007 నుంచి 2017 సంవత్సరాల మధ్య హెచ్‌1-బీ వీసాల కోసం భారతీయులు అత్యధికంగా 2.2మిలియన్ల దరఖాస్తులు దాఖలు చేశారు. 3లక్షలకు పైగా దరఖాస్తులతో చైనా తర్వాతి స్థానంలో ఉంది.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.