latest breaking telugu news
close

తాజావార్తలు

చదివిన కాసేపయినా ఏకాగ్రతతో చదివాను
సీబీఎస్‌ఈ టాపర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యార్థుల్లో పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి... కొందరు మార్కుల సాధన కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు. ఈ కేటగిరీకి చెందిన వాళ్లు కేవలం ఉద్యోగం మీద మాత్రమే ఆధార పడి బతకాల్సివస్తుంది. మరికొందరు చదువు మీద ఏకాగ్రత తగ్గించి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇలాంటి వర్గానికి చెందిన వారు ఆటలు, ఇతర కళారంగంలో రాణించగలుగుతారు. ఇంకొందరు విద్యార్థులు ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఇటు ఉద్యోగంలోనూ అటు సృజన రంగంలోనూ రాణించగలరు. ఈ మూడో కేటగిరికి చెందిన విద్యార్థే సీబీఎస్‌ఈ టాపర్‌ మేఘనా శ్రీవాత్సవ. మేఘన బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువులోనే కాదు ఆటలు, కళలు, నృత్యం, పెయింటింగ్‌ రంగాల్లోనూ ఈమెది అందెవేసిన చేయి.

మేఘన తండ్రి గౌతమ్‌ శ్రీవాత్సవ. గతంలో మీడియా రంగంలో సేల్స్‌ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం మానవ్‌ రచనా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. తల్లి అల్పన శ్రీవాత్సవ. ఈమె గృహిణి. వీరిది సాధారణ మధ్య తరగతి కుటుంబం.

మేఘన సాధించిన ఘనతపై ఆమె తండ్రి గౌతమ్‌ మాట్లాడుతూ...‘ మేఘన చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉండేది. అన్ని రంగాల్లో తనదైన ముద్రవేయాలని ఆమె ఎప్పుడు అంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే సంగీతం, నృత్యం నేర్చుకుంది. ఆటల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. పెయింటింగ్‌ అద్భుతంగా వేస్తుంది. అయితే ఈమె పరీక్షల్లో అదే పనిగా కూర్చుని చదవలేదు. పరిమిత సమయం మాత్రమే చదివింది. మిగతా సమయంలో తనకు ఇష్టమైన వ్యాపకాలతో సమయం గడిపేది. అయినా మేమెప్పుడూ తనపై ఒత్తిడి తీసుకురాలేదు. ఎందుకంటే తనంటే ఏంటో మాకు తెలుసు. ఈ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తుందని తెలుసు. కానీ టాపర్‌ అవుతుందని అసలు ఎవరూ ఊహింలేదు. నా కూతురు నేను గర్వపడేలా చేసింది. తను సైకాలజీ చదవాలనుకుంటోంది. ఇందుకోసం నాణ్యమైన కళాశాలలను వెతుకుతున్నాను. మనదేశంలో కాకపోయినా విదేశాలకు పంపయినా తన కల సాకారం అయ్యేలా చేస్తాం. నా కూతురు నన్ను తలెత్తుకునేలా చేసింది. అందుకు ఆమె కోసం మేం చేయడానికైనా సిద్ధం’ అని తెలిపారు.

అనంతరం మేఘన మాట్లాడుతూ...‘ నేను టాపర్‌ కావడంలో రహస్యమేమీ లేదు. చదివిన కాసేపయినా ఏకాగ్రతతో చదివాను. అలాగని నా తల్లిదండ్రులు నామీద ఒత్తిడి తీసుకురాలేదు. క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లి పాఠాలు విన్నాను. ఈ క్రెడిట్‌ నా ఒక్కరిదే కాదు. మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకూ దక్కుతుంది. వాళ్ల ప్రోత్సాహం వల్లే ఈ రోజు నేను టాపర్ అయ్యాను.’ అని తెలిపింది.

శనివారం విడుదలయిన సీబీఎస్‌ఈ ఫలితాల్లో మేఘన 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించింది. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మేఘన పేరు మార్మోగిపోతోంది. ఆర్ట్స్‌ విద్యార్థిని అయిన మేఘన పరీక్షల ఫలితాల్లో హిస్టరీలో నూటికి 100 మార్కులు, జాగ్రఫీలో 100, సైకాలజీలో 100, ఎకనామిక్స్‌లో 100, ఇంగ్లిష్‌లో నూటికి 99 మార్కులు సాధించింది.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.