latest breaking telugu news
close

తాజావార్తలు

వాజ్‌పేయీకి నివాళులర్పించనున్న విదేశీ నేతలు

దిల్లీ: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి నివాళులర్పించేందుకు పొరుగు దేశాల నేతలు నేడు భారత్‌కు రానున్నారు. బూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్‌, లక్ష్మణ్‌ కిరిల్లా, అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌ ఈ సాయంత్రం దిల్లీ చేరుకుని వాజ్‌పేయీ పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయీ భౌతికకాయాన్ని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం స్మృతి స్థల్‌లో అధికారిక లాంఛనాల మధ్య వాజ్‌పేయీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇతర దేశాధినేతల సంతాపం

మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు.

* భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మృతి విచారకరం. ఆయన గొప్ప నాయకుడే కాదు.. సాహిత్యం, కళల్లో మంచి స్కాలర్‌ కూడా. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాల్దీవుల్లో పర్యటించారు. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్‌కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం - మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ అబ్దుల్ గయూమ్‌

* భారత గొప్ప నేతల్లో వాజ్‌పేయీ ఒకరు. ఆయన మృతి విచారకరం. యూకే ప్రభుత్వానికి ఆయన మంచి సన్నిహితుడు- యూకే మంత్రి మార్క్‌ ఫీల్డ్‌

* వాజ్‌పేయీ ప్రపంచం గర్వించదగ్గ నేత. గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతిపట్ల సానుభూతి ప్రకటిస్తున్నాం - రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌

* ఈ రోజు ఓ గొప్ప మానవతావాదిని, నిజమైన స్నేహితుడిని మనం కోల్పోయాం. ఆయన అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు - శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.