latest breaking telugu news
close

తాజావార్తలు

మా టీచర్‌కు సైట్‌ కొట్టేవాడిని
ఆమెను సైకిల్‌పై ఎక్కించుకుని ఇంటి వద్ద దింపేవాడిని: సల్మాన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు పాఠశాలలో ఓ లవ్‌స్టోరీ ఉండేదట. ఏకంగా తనకు పాఠం చెప్పడానికి వచ్చిన టీచర్‌కే సైట్‌ కొట్టేవాడినని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘దస్‌ కా దమ్‌’ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తుండగా షోకు వచ్చిన వారిని సల్మాన్‌ సరదాగా ఓ ప్రశ్న వేశాడు. ‘స్కూల్లో చదివేటప్పుడు ఎవరైనా టీచర్‌కు సైట్‌ కొట్టారా?’ అని అడిగారు.

ఇందుకు అక్కడున్నవారు చిన్నతనంలో తమకు జరిగిన సంఘటనలను సరదాగా పంచుకున్నారు. ఈ సందర్భంగా సల్మాన్‌ తన లవ్‌స్టోరీ గురించి వెల్లడించారు. తాను చదువుకుంటున్న రోజుల్లో ఓ టీచర్‌ను ఇష్టపడ్డానని చెప్పారు. ఆమె పాఠం చెబుతుంటే అలా చూస్తూ ఉండేవాడినని అన్నారు. ఆమెను మెప్పించడానికి రోజూ తనను సైకిల్‌పై ఎక్కించుకుని ఇంటి వద్ద దింపేవాడినని, ఆమెను ముందు కూర్చోపెట్టుకోవడానికి తన లంచ్‌ బాక్స్‌ను వెనకపెట్టుకునేవాడనని తెలిపారు. దాంతో అక్కడున్న వారంతా సల్మాన్‌ లవ్‌స్టోరీ విని పగలబడి నవ్వారు. ‘టీచర్‌కు సైట్‌ కొట్టకుండా ఉండని విద్యార్థి ఉండడు. చాలా మంది దీనిని ఒప్పుకోరు కానీ నేను మాత్రం మా టీచర్‌కు తెగ సైట్‌ కొట్టేవాడిని’ అని వెల్లడించారు సల్మాన్‌.

ప్రస్తుతం సల్మాన్‌ ‘భారత్‌’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. 2019 రంజాన్‌కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.