latest breaking telugu news
close

తాజావార్తలు

శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

తిరుమల: తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేకువ జామున శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మళయప్పస్వామి వారు వరాహ పుష్కరిణి చెంతకు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఉత్సవమూర్తులకు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపన తిరుమంజనం ప్రక్రియను అర్చకులు వేడుకగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పెద్దజీయర్ సమక్షంలో అర్చకులు చక్రతాళ్వారుకు పుష్కర స్నానం చేయించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రాత్రి శ్రీవారి ఆలయంలో నిర్వహించే ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.