latest breaking telugu news
close

తాజావార్తలు

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్‌లో కాల్పులు.. ఐదుగురికి గాయాలు

న్యూయార్క్‌ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని సైరాకస్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని కాల్పుల్లో గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇది చాలా విషాదకరమైన ఘటన అని సైరాకర్‌ పోలీసు చీఫ్‌ ఫ్రాంక్‌ ఫౌలర్‌ తెలిపారు. అయితే గాయపడ్డవారి పరిస్థితి ఎలా ఉందో వెల్లడించలేదు.

సైరాకస్‌ అగ్నిమాపక దళం ఈ ఘటనపై స్పందించింది. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పెట్టింది. క్యాన్సర్‌తో మృతి చెందిన ఓ వ్యక్తి సంస్మరణార్ధం కుటుంబసభ్యులంతా ఓ చోట చేరిన సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. పది రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు పేర్కొంది.

అమెరికాలోని మేరీల్యాండ్‌లోని హార్‌ఫోర్డ్‌ కౌంటీలో గురువారం ఓ మహిళ ఉన్నట్టుండి తుపాకీతో కాల్పులకు పాల్పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌ శివారు, మిడిల్‌టన్‌లో ఉన్న డబ్ల్యూటీఎస్‌ పారడైమ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వద్ద బుధవారం రాత్రి మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.