latest breaking telugu news
close

తాజావార్తలు

‘అర్జున్‌రెడ్డి’ తర్వాత ఇది పర్‌ఫెక్ట్‌!
‘ఓ ట్రీట్‌లా అనిపించింది’: రామ్‌చరణ్‌

హైదరాబాద్‌: కథానాయకుడు రామ్‌చరణ్‌ ‘గీత గోవిందం’ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రమిది. పరుశురాం దర్శకుడు. రష్మిక కథానాయిక. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మహేశ్‌బాబు, సమంత, శరత్‌ మరార్‌, మారుతి, అనిల్‌ రావిపూడి తదితరులు ట్వీటర్‌ వేదికగా మెచ్చుకున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘‘అర్జున్‌రెడ్డి’ తర్వాత పర్‌ఫెక్ట్ ‌ఛేంజ్‌ ఓవర్‌‌. తెరపై విజయ్‌ దేవరకొండ, రష్మిక సహజ నటన ట్రీట్‌లా అనిపించింది. వీళ్ల ప్రదర్శన స్క్రిప్ట్‌ను అందంగా తీర్చిదిద్దింది. గోపీ సుందర్‌ చక్కటి సంగీతం అందించారు. కథను చాలా చక్కగా రాశారు, తెరకెక్కించారు. ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురాంకు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు, జీఏ2 పిక్చర్స్‌కు శుభాకాంక్షలు’ అని చెర్రీ పేర్కొన్నారు.

కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఈ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ‘‘గీత గోవిందం’ మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ప్రధాన తారాగణం విజయ్‌ దేవరకొండ, రష్మిక తమ చక్కటి నటనతో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.‌ బన్నీ వాసుకు, పరుశురాంకు అభినందనలు. వెన్నెల కిశోర్‌ నువ్వంటే ఎప్పుడూ ఇష్టమే. రాహుల్‌ రామకృష్ణ పెళ్లి ఎక్కడ చేద్దాం’ అని ట్వీట్‌ చేశారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.