latest breaking telugu news
close

తాజావార్తలు

శబరిమలలో అర్ధరాత్రి ఉద్రిక్తత

శబరిమల: కేరళలోని శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ప్రాంగణంలో పోలీసుల ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఆదివారం అర్ధరాత్రి సమయంలో భక్తులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భాజపా, ఆరెస్సెస్‌ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నివాసం సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా నిరసనకు దిగారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పు తర్వాత గత నెలలో శబరిమల ఆలయాన్ని తెరవగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల మండల పూజల నిమిత్తం ఆలయాన్ని మరోసారి తెరిచారు. దీంతో గత ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సన్నిధానంలో 144 సెక్షన్‌ విధించారు. రాత్రి సమయాల్లో ఆలయ పరిసరాల్లో భక్తులెవరూ ఉండకుండా నిషేధం విధించారు.

అయితే ఈ ఆంక్షలపై అసంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు ఆదివారం అర్ధరాత్రి సయమంలో ఆలయ ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఆందోళన చేసే భక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ భాజపా, ఆరెస్సెస్‌ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనకు దిగారు. ఆలయంలో ఆంక్షలు ఎత్తివేయాలని, శబరిమలలో మోహరించిన పోలీసు బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది: కేంద్రమంత్రి ఆల్ఫోన్స్‌

తాజా ఉద్రిక్తతలపై కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమలలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉన్నాయని విమర్శించారు. అవసరం లేకున్నా 144 సెక్షన్‌ విధించి అయ్యప్ప భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భక్తులేమైనా ఉగ్రవాదులా.. 15వేల మంది పోలీసులను ఎందుకు నియమించారు అని ప్రశ్నించారు.


సినిమా

మరిన్ని

రాజకీయం

జనరల్‌

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.