close

శుక్రవారం, జూన్ 22, 2018

తాజా వార్తలు

చేనేత కార్మికులు ఆరోగ్యం కాపాడుకోవాలి

శాయంపేట: చేనేత కార్మికులు ఆరోగ్యం కాపాడుకోవాలని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో కార్మికులకు హెల్త్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకాల లలితా నర్సింగ్‌ హోమ్‌ సహకారంతో హెల్త్‌కార్డులను అందజేసినట్లు తెలిపారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటభాస్కర్‌, సర్పంచ్‌ చంద్రమౌళి, లలితానర్సింగ్‌హోమ్‌ వైద్యులు రాజేశ్వరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.