close

శుక్రవారం, సెప్టెంబర్ 21, 2018

తాజా వార్తలు

ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో హరితహారం

నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామంలో శనివారం ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సురేశ్‌ రాథోడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలో సమీప చెరువు గట్టు వెంట మొక్కలను నాటారు. అనంతరం సురేశ్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. నర్సంపేట డివిజన్‌లో మోడల్‌ తాటివనంగా ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశామన్నారు. మొక్కల పెంపకానికి కావాల్సిన వసతులను ఎక్సైజ్‌ శాఖ ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు శ్రీనివాసరావు, శశికుమారి, శంకర్‌ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.