close

సోమవారం, డిసెంబర్ 10, 2018

తాజా వార్తలు

వీవీ పాట్‌లోని స్లిప్పులనూ లెక్కించాలి
రిటర్నింగ్‌ అధికారికి దాసోజు శ్రవణ్‌ వినతి
ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అన్ని పోలింగ్‌ బూత్‌లకు చెందిన 238 ఈవీఎంలతో పాటు వీవీపాట్‌లలోని స్లిప్పులనూ లెక్కించాలని ప్రజాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి ముషారఫ్‌ ఫారూఖీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ అవకతవకలు, అవినీతి అధికారుల బండారం బయటపెట్టినందుకు తనను ఓడించాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. లోపాలున్న ఈవీఎంలను వినియోగించడం వల్లే మూడు గంటలపాటు పోలింగ్‌ ఆలస్యమైందన్నారు. వేల సంఖ్యలో ఓట్లు తొలగించారని అందుకే అధికారులపై నమ్మకం లేదని, ఈవీఎంల వద్ద అత్యాధునిక జామర్లు ఏర్పాటు చేయాలని కోరారు. వీవీపాట్‌లలోని స్లిప్పులను లెక్కించేందుకు అవసరమయ్యే అదనపు ఖర్చును తాను భరిస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జనరల్

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.