close

ఆదివారం, మే 27, 2018

తాజా వార్తలు

విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రంగా కలచివేస్తున్నాయి
కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): గత కొంత కాలంగా వివిధ పత్రికల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వస్తున్న వార్తలు తనను ఎంతగానో కలచివేస్తున్నాయని మాజీ అదనపు డీజీపీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ క్లినికల్‌ సైకాలజిస్ట్‌(ఐఏసీపీ) తెలంగాణ రీజినల్‌ శాఖ ఆధ్వర్యంలో బోయినపల్లిలోని జాతీయ మానసిక వికలాంగుల కేంద్రం ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరుగనున్న థర్డ్‌ వేవ్‌ కాగ్నెటివ్‌ బిహేవియర్‌ థెరపి సెమినార్‌ను లక్ష్మీనారాయణ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి ప్రవర్తనలో మార్పుల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులు సంతోషకరమైన సమాజం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలతో తమ వద్దకు వచ్చే తల్లితండ్రులకు మొదటగా వైద్య పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐఎమ్‌హెచ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బి.వి.రామ్‌కుమార్‌, ఐఏసీపీ తెలంగాణ రీజనల్‌ శాఖ అధ్యక్షురాలు డా.షణ్ముకి, ప్రధాన కార్యదర్శి డా.సి.వెంకటసుబ్బయ్య, ఇతర ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.