close

శుక్రవారం, ఆగస్టు 17, 2018

తాజా వార్తలు

కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యయత్నం

తిరుపతి లీగల్‌: తిరుపతి కోర్టు ప్రాంగణంలో మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. స్థానికుల కథనం మేరకు మూడవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కేసు విచారణ జరుగుతుండగా ఓ వ్యక్తి ఆటోలో కోర్టు ముందు దిగి కిరోసిన్‌ డబ్బాతో ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులతో కోర్టు హాలు నిండి ఉంది. ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న‌ డబ్బాలోని కిరోసిన్‌ను హఠాత్తుగా ఒంటి మీద పోసుకోని నిప్పు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అడ్డుకుని అతనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.