close

శుక్రవారం, సెప్టెంబర్ 21, 2018

జనరల్

23న అండర్‌-19 సీˆఎం కప్‌ ఖోఖో జట్ల ఎంపిక
పాతబస్టాండ్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నగరంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల(ఆర్ట్స్‌) మైదానంలో ఈ నెల 23వ తేదీన సీˆఎం కప్‌(ఎస్‌జీఎఫ్‌) అండర్‌-19 బాల, బాలికల జిల్లాస్థాయి ఖోఖో జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి కృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎస్‌జీఎఫ్‌, ఖోఖో సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఎంపికలలో పాల్గొనే బాల, బాలికలు విధిగా ఆన్‌లైన్‌లో పేరును నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన బాలబాలికల జట్లు పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రాపురంలో అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగనున్న అండర్‌-19 సీˆఎం కప్‌ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 23వ తేదీన ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటలకు హాజరవ్వాలన్నారు. ఇతర వివరాలకు 8074066282 నెంబర్‌కు సప్రదించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.