close

సోమవారం, డిసెంబర్ 10, 2018

జనరల్

ఆలయంలో ఆరాధనలు
యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: బాలాలయంలో నారసింహ ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున 3 గంటలకే ఆలయాన్ని తెరిచిన పూజారులు సుప్రభాతం చేపట్టారు. నిత్యారాధనల్లో భాగంగా ప్రతిష్ఠమూర్తులకు హారతిని నివేదించి ఉత్సవమూర్తులను అభిషేకించారు. దర్శనమూర్తులకు స్వర్ణపుష్పార్చన జరిపారు. మండపంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణోత్సవం, అలంకార సేవోత్సవాలను ఆలయ సంప్రదాయంగా నిర్వహించారు. స్వామికి జరిగిన స్వర్ణ పుష్పార్చనలో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కల్యాణోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లను గజవాహనంపై ఆశీనులనుగావించి సేవోత్సవాన్ని చేపట్టారు. నిత్యకల్యాణంలో భక్తదంపతులు అధికంగా పాల్గొని ఆశీస్సులు పొందారు. కల్యాణం నిర్వహించిన భక్తులతో మండపం నిండిపోయింది.

నిత్యరాబడి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఖజానాలో ఆదివారం వివిధ విభాగాల ద్వారా రూ.30,11,180 నిత్యరాబడి పద్దు కింద జమయ్యాయని దేవస్థానం ఈవో ఎన్‌.గీత తెలిపారు. ఈ రాబడిలో ప్రధాన పూజలతో రూ.2,36,954, వి.ఐ.పి. (రూ.150) టికెట్లతో రూ.7,12,200, అతిశీఘ్ర దర్శనాలతో రూ.33,000, వ్రతాలతో రూ.2,14,000, కల్యాణకట్టతో రూ.60,000, అద్దె గదులతో రూ.97,710, శాశ్వత పూజలు రూ.15,348, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.13,16,030, శాశ్వత పూజలతో రూ.15,348, అన్నప్రసాదంతో రూ.16,938, వాహన పూజలతో రూ.29,500 మిగతావి వివిధ విభాగాల చేకూరాయని ఈవో వివరించారు.

యాదాద్రిని దర్శించుకున్న సీపీ మహేశ్‌ భగవత్‌
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థాన ఈవో గీత, ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం మహామంటపంలో అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామి వారి శేషవస్త్రాలు, తీర్ధ, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన నిర్మాణమవుతున్న యాదాద్రి ప్రధానాలయ పనులను పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. భద్రత పరమైన విషయాలపై చర్చించారు. అనంతరం గుట్ట ఠాణాను పరిశీలించారు. ఆయన వెంట డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ నర్సింహరావు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.