close

సోమవారం, డిసెంబర్ 10, 2018

జనరల్

నిబంధనల ఉల్లంఘన.. కేసులు
జిల్లాలో మొత్తం 52 కేసులు
న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో హోరాహోరీ ప్రచారాలతో అభ్యర్థులు సత్తా చాటారు. వివిధ రూపాల్లో ప్రచారం చేసే క్రమంలో కొంతమంది నేతలు నియమాలను ఉల్లంఘించారు. మరికొందరు.. పోలింగ్‌ ప్రక్రియను విఘాతం కలిగించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలపై కేసుల మోత మోగింది. నిబంధనలు బేఖాతరు చేసిన జాబితాలో జిల్లా పరిధిలో 52 కేసులు నమోదు కావడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కేసులు నమోదైన తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.

పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 25 ఠాణాలు ఉన్నాయి. నవంబరు 12వ తేదీ నుంచి నియమావళి అమల్లోకి వచ్చింది మొదలు.. ఎన్నికల అధికారులు జిల్లాలో అభ్యర్థులు, పార్టీలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల కదలికలను గమనించేందుకు వివిధ బృందాలను రంగంలోకి దించింది. ప్రజల నుంచి పలు రకాల ఫిర్యాదుల అందగా.. మొత్తం 52 కేసులు నమోదు చేశారు. జిల్లాలో అత్యధికంగా వన్‌టౌన్‌ పోలీసు ఠాణా పరిధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 7వ తేదీ పోలింగ్‌ సందర్భంగా విఘాతం కలిగించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. ఫిర్యాదులు అందిన వాటిలో నిర్దేశిత సమయాన్ని అతిక్రమించడం, అనుమతి లేకుండా మైక్‌ల వినియోగం, గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం తదితర అంశాల్లో అభ్యర్థులు, పార్టీల నేతలపై ఆరోపణలు ఉన్నాయి.

పోలింగ్‌కు విఘాతం..
నియమావళి ఉల్లంఘన కింద జిల్లాలోని దుబ్బాక - 4, అక్కన్నపేట-1, జగదేవపూర్‌-3, తొగుట-3, మద్దూరు-1, గజ్వేల్‌-5, చిన్నకోడూరు-1, మిరుదొడ్డి-1, ములుగు-1, గౌరారం-6, భూంపల్లి-3, రాయపోల్‌-2, మర్కూక్‌-4, కొమురవెల్లి-1, చేర్యాల పోలీ సు ఠాణా పరిధిలో 1 కేసు నమోదైంది.
* పోలింగ్‌ జరుగుతున్న సమయంలో (పోలింగ్‌ వయోలెన్సు) ఘర్షణలు, గొడవలు దిగటం సహా ప్రక్రియ విఘాతం కలిగించిన అంశాల్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ పరిధిలోకి బేగంపేట-1, రాయపోల్‌-1, మద్దూరు-1, చిన్నకోడూరు-2, అక్కన్నపేట-1, దుబ్బాక-1, హుస్నాబాద్‌-1, ములుగు ఠాణా పరిధిలో 2 కేసులు చేశారు. ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో సహా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్సు బృందాలు, ప్రజలు, ఇతర పార్టీల నేతలు ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు. ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించి నోటీసులు జారీ చేశారు. సదరు వ్యక్తులపై న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.